శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 02, 2020 , 02:55:20

చెరువులో మహిళ మృతదేహం లభ్యం

చెరువులో మహిళ మృతదేహం లభ్యం

  ఈ నెల 29న అదృశ్యమైన మహిళగా   గుర్తింపు  

   భర్త, అత్త వేధింపులే కారణమని  బంధువుల  ఆరోపణ

సూర్యాపేటసిటీ : ఈ నెల 29న సూర్యాపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసుగా నమోదైన మహిళ బుధవారం శవమై జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంకుబండ్‌లో తేలింది. ఇటీవల వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న తల్లి తన ఇద్దరు పిల్లలను మినీ ట్యాంక్‌బండ్‌లో తోసి చంపిన సంఘటన మరువక ముందే మరో మహిళ సద్దుల చెరువులో మృతి చెందడం కలకలం సృష్టించింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం మామిళ్ల గూడెం గ్రామానికి చెందిన రాంరెడ్డి, వెంకటమ్మల ఏకైక కుమార్తె పద్మ(28)ని జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన కమలమ్మ కుమారుడు పాపట్ల యుగంధర్‌రెడ్డికి ఇచ్చి పదేళ్ల క్రితం వివా హం చేశారు. వీరికి అవనీధర్‌రెడ్డి(8) అనే కుమారుడు ఉన్నాడు. వీరు  కొన్ని సంవత్సరాలుగా అంజనాపురి కాలనీలో నివాసముంటూ జాతీయ రహ దారి వెంట ఏ టూ జడ్‌ వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ ని ర్వహిస్తున్నాడు. ఈ నెల 28న భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడంతో మన స్తాపంతో  పద్మ ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. ఈ విషయమై పద్మ తల్లిదండ్రులకు తెలియడంతో సోదరుడు గోపిరెడ్డి సూర్యాపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 29న ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బంధు వు లు, తల్లిదండ్రులు పద్మ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. బుధవారం సాయంత్రం సద్దులచెరువులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న వారు తన కుమార్తె పద్మగా తల్లిదండ్రులు గుర్తించారు. 

కట్నంగా ఇచ్చిన భూమి అమ్మాలని ఒత్తిడి..

పెళ్లి సమయంలో పద్మకు తల్లిదండ్రులు మామిళ్లగూడెం లో ఎకరం భూమిని పసుపు కుంకుమ కింద ఇచ్చారు.  ఆరేళ్లుగా యుగంధర్‌రెడ్డి తల్లి కమలమ్మ  సదరు భూమి అమ్మి డబ్బులు తేవాల్సిందిగా పద్మను వేధిస్తున్నారని ఈ విషయమై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో మందలించడం జరిగిందన్నారు. రెండు నెలల క్రితం మద్యం తాగి వచ్చిన యుగంధర్‌ తమ కుమార్తెను విచక్షణా రహితంగా కొట్టడంతో తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం అత్త కమలమ్మ సర్ది చెప్పి కాపురానికి తీసుకెళ్లింది. తన బిడ్డకు కట్నంగా ఇచ్చిన ఎకరం అమ్మకపోవడంతో భర్త, అత్త  కొట్టి చంపి చెరువులో పడేసి ఉండవచ్చని పద్మ తల్లిదండ్రులు, సోదరుడు గోపిరెడ్డి, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు  చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. logo