శనివారం 04 జూలై 2020
Suryapet - Jul 01, 2020 , 04:09:51

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

 జిల్లా పంచాయతీ అధికారి ఎన్‌.యాదయ్య 

చింతలపాలెం : గ్రామాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఎన్‌.యాదయ్య అన్నారు.  మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ గ్యామానాయక్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ పనుల పురోగతి, ఆరో విడుత హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా  యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ  గురించి  మిగిలి ఉన్న మౌలిక పనులను  పూర్తి చేసేలా  ప్రజాప్రతినిధులకు సూచించారు.  పలు గ్రామపంచాయతీ కార్యాలయాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు.   పంచాయతీ అధికారి  ఎంపీఓ జగదీశ్‌కుమార్‌, ఈసీ రవి,  కార్యదర్శులు పాల్గొన్నారు.


logo