శనివారం 04 జూలై 2020
Suryapet - Jul 01, 2020 , 03:50:30

మొక్కల సంరక్షణను బాధ్యతగా చేపట్టాలి

మొక్కల సంరక్షణను బాధ్యతగా చేపట్టాలి

అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, ‘పేట’ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ 

బొడ్రాయిబజార్‌ : మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ డి.సంజీవరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. 6వ విడుత హరితహారంలో భాగంగా మంగళవారం 18వ వార్డులో మొక్కలు నాటి మాట్లాడారు. వాతావరణ కాలుష్య నియంత్రణకు మొక్కలు దోహదపడుతాయని, వాటి ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి విధిగా మొక్కలు నాటాలని సూచించారు.  వెన్నెల నాగరాజు కళాబృందం హరితహారం లక్ష్యాలు, మొక్కల పెంపకం ఆవశ్యకతను గురించి పాటల రూపంలో ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.  కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పి.రామానుజులరెడ్డి, కౌన్సిలర్‌ మాలోతు కమలాచంద్రునాయక్‌, తండు రమేశ్‌గౌడ్‌, సక్రునాయక్‌, లింగానాయక్‌, సైదులు, సోమయ్య, రవి పాల్గొన్నారు. 

పర్యావరణాన్ని పరిరక్షించాలి : నిమ్మల  

సూర్యాపేట టౌన్‌ : పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని, మంత్రి జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో హరితహారాన్ని విజయవంతంగా నిర్వహించి సూర్యాపేటను పచ్చని జిల్లాగా తీర్చిదిద్దుకుందామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. 6వ విడుత హరితహారంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రేడ్‌-1 శాఖా గ్రంథాలయంలో సిబ్బంది, పాఠకులతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి సీతారామశాస్త్రి, లైబ్రేరియన్లు శ్యాంసుందర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, ఎల్గూరి రమాకిరణ్‌, రేపాల పాండు, రఫీ, గట్ల చరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మొక్కలు నాటి సంరక్షించాలి : రజిని 

తిరుమలగిరి : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిని అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో హరితహారం మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు ప్రాణకోటికి జీవనాధారమని, స్వచ్ఛమైన గాలి కోసం విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఉమేశ్‌చారి, కౌన్సిలర్లు భాస్కర్‌, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. 

 కాసరబాద, ఇమాంపేటలో..   

సూర్యాపేట రూరల్‌ : హరితహారంలో నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలని జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కాసరబాద, ఇమాంపేట  గ్రామాల్లో  మొక్కలు నాటి మాట్లాడారు. సర్పంచులు కొల్లు రేణుక, పాముల ఉపేందర్‌, ఎంపీటీసీ బంటు నాగమ్మ, సంకరమద్ది రమణారెడ్డి, నరేశ్‌, సైదులు  పాల్గొన్నారు. 

నర్సింహులగూడెంలో.. 

నాగారం : హరితహారంలోభాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సర్పంచ్‌ ధరావత్‌ గణేశ్‌ అన్నారు. మంగళవారం నర్సింహులగూడెంలో మొక్కలు నాటి మాట్లాడారు.  పంచాయతీ కార్యదర్శి దావుల సతీశ్‌, ఉప సర్పంచ్‌ తరాల పెద్దమ్మ, మల్లేశ్‌, చిత్తలూరి సుమలత, చెన్నబోయిన సైదులు, ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

గానుగుబండ, తూర్పుగూడెంలో.. 

తుంగతుర్తి : మండలంలోని గానుగుబండ, తూర్పుగూడెం గ్రామాల్లో 6వ విడుత హరితహారంలో భాగంగా కళాజాత బృందం హరితహారం ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలంతా తమ ఇళ్లల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.  గానుగుబండ సర్పంచ్‌ రామచంద్రారెడ్డి, తూర్పుగూడెం సర్పంచ్‌  పూలమ్మ,  గంట భిక్షపతి, ఉపేందర్‌, పాలకుర్తి శ్రీకాంత్‌, మంజుల, నాగలక్ష్మి, కార్యదర్శులు కృష్ణ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. logo