సోమవారం 06 జూలై 2020
Suryapet - Jun 30, 2020 , 04:38:51

మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే బొల్లం ఘనస్వాగతం

మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే బొల్లం ఘనస్వాగతం

మునగాల : హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్తున్న మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ నియోజకవర్గ ముఖద్వారం మాధవరం వద్ద సోమవారం ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కోదాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శిరీషాలక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్‌, మోతె ఎంపీపీ ఆశ, సొసైటీ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, టీఆర్‌ఎస్‌ నాయకుడు నల్లపాటి శ్రీనివాస్‌, ఎలక వెంకట్‌రెడ్డి, కవిత, దొంగరి నాగేశ్వర్‌రావు, నీలా సత్యనారాయణ, కొంపల్లి వీరబాబు, సర్పంచులు పాల్గొన్నారు.    


logo