గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jun 30, 2020 , 03:09:02

మునగాలలో 13 మంది హోం క్వారంటైన్‌

 మునగాలలో 13 మంది  హోం క్వారంటైన్‌

మునగాల : చిలుకూరు మండలంలోని చెన్నారిగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యానికి గురై  మండల కేంద్రంలో రెడ్డినగర్‌లో తన కూతురు నివాసంలో ఉంటుంది. ఆమెకు కరోనా పాజిటివ్‌  రావడంతో అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు.  సోమవారం  తాసిల్దార్‌ పాండునాయక్‌,  వైద్యాధికారి యాదా రమేశ్‌ గ్రామపంచాయతీ సిబ్బందితో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించారు.  రెడ్డినగర్‌ వీధిలోకి ఎవరు వెళ్లకుండా రహదారులను మూసివేశారు. గణవరం రోడ్డులో దుకాణాలు మూసివేయించినట్లు తెలిపారు. పాజిటివ్‌ వ్యక్తితో కాంటాక్టు ఉన్న 13 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని అదేశించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చింతకాయల ఉపేందర్‌, హెచ్‌ఈఓ షాబుద్దీన్‌, గ్రామ కార్యదర్శి శ్వేత, వీఆర్‌ఓ సృజన, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.   


logo