గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 28, 2020 , 02:46:56

ముగిసిన కర్నల్‌ సంతోష్‌బాబు దశ దిన కర్మ

 ముగిసిన కర్నల్‌ సంతోష్‌బాబు దశ దిన కర్మ

  • నివాళులర్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట టౌన్‌ : భారత్‌, చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు దశదిన కర్మ శనివారం ముగిసింది. జిల్లా కేంద్రంలోని వారి నివాసంలో జరిగిన కార్యక్రమానికి  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరై సంతోష్‌బాబు చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా మంత్రి కర్నల్‌ సేవలను  కొనియాడారు. ఆయన తల్లిదండ్రులు సంతోష్‌బాబు కవర్‌ ఫొటోతో ప్రత్యేకంగా అలంకరించిన  భగవద్గీత గ్రంథాలను ఆవిష్కరించి అందరికీ పంపిణీ చేశారు.  ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, టీఆర్‌ఎప్‌ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అన్నపూర్ణ, ఎంపీపీ నెమ్మాది భిక్షం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌ పాల్గొన్నారు.   


logo