సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 28, 2020 , 02:45:38

కొనసాగుతున్న మూసీ నీటి విడుదల

కొనసాగుతున్న మూసీ నీటి విడుదల

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు, గేటు ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 5వ నంబర్‌ గేటుకు నూతన రెగ్యులేటరీ ఏర్పాటు కోసం మూడు రోజుల నుంచి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా విడుదల చేసిన తర్వాత  నూతన గేటు ఏర్పాటు పనులను ప్రారంభించనున్నారు. శనివారం నూతన రెగ్యులేటరీ గేటును ఈఈ భద్రూనాయక్‌ పరిశీలించారు. త్వరలోనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్‌ గేటును తొలగించి శాశ్వత గేటును అమర్చుతామని చెప్పారు. ఆయన వెంట డీఈ నవీకాంత్‌, ఏఈ శ్రీకాంత్‌ ఉన్నారు. 


logo