గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jun 28, 2020 , 00:36:31

హరితోద్యమం చేపట్టాలి

హరితోద్యమం చేపట్టాలి

  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

 నకిరేకల్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు.

రాష్ట్రంలో 33శాతం అటవీ విస్తీర్ణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మొదటి విడుతలో భాగంగా నాటిన మొక్కలు నేడు ఫలితాలు ఇస్తున్నాయని, ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత చేపట్టాలని సూచించారు. మానవ మనుగడకు మొక్కలే కీలకమనే విషయాన్ని గ్రహించాలన్నారు. హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. హరిత లక్ష్యం కేవలం ప్రభుత్వం, ఆయా శాఖలది మాత్రమే బాధ్యత కాదని, అందరూ భాగస్వాములైతేనే విజయవంతమవుతుందని పేర్కొన్నారు.

అందరి సహకారంతో హరిత లక్ష్యాన్ని అధిగమించి మొక్కల పెంపకంలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలన్నారు.  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కృష్ణప్రసాద్‌, ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్‌రావు, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ గోర్ల సరితావీరయ్యయాదవ్‌, ఎంపీడీఓ జె.వెంకటేశ్వర్‌రావు, తాసిల్దార్‌ జంగయ్య, ఎఫ్‌ఎస్‌ఓ రాములు తదితరులు  పాల్గొన్నారు. 


తాజావార్తలు


logo