ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 27, 2020 , 00:58:06

డ్రైవర్‌ నిర్లక్ష్యానికి కుటుంబం బలి

డ్రైవర్‌ నిర్లక్ష్యానికి  కుటుంబం బలి

చివ్వెంల : క్యాన్సర్‌తో బాధ పడుతున్న తల్లిని పెద్దాసుపత్రిలో చూపించేందుకు  ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది.  అజాగ్రత్తతో కారు నడిపి సిమెంట్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టగా..  కొడుకు దుర్మరణం చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బత్తుల జాన్‌జోసెఫ్‌ (35) గుంటూరులో ఇంటీరియర్‌ షోరూం నడిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో తల్లిదండ్రులు తన వద్దే ఉన్నారు. కాగా, జోసెఫ్‌ తల్లి విజయకుమారి (60)  క్యాన్సర్‌తో  వైద్యం కోసం హైదరాబాద్‌లోని బసవతారకం దవాఖానకు శుక్రవారం తండ్రి సత్యానందం  కలిసి తన షాపులో పనిచేస్తున్న అవినాశ్‌ను డ్రైవర్‌గా తీసుకుని కారులో బయలుదేరారు.  అజాగ్రత్తగా నడిపిన కారు డ్రైవర్‌ చివ్వెంల  ఖాసీంపేట వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న సిమెంట్‌ ట్యాంకర్‌ను  ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. వ గాయాలైన తల్లీకొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. సత్యానందం, అవినాశ్‌లకు తీవ్ర గాయాలు కావడంతో  సూర్యాపేట జనరల్‌ దవాఖానకు  ఙూరిస్థితి విషమించి సత్యానందం మృతిచెందాడు. డ్రైవర్‌ అవినాశ్‌ను విజయవాడ దవాఖానకు తరలించారు.  తమ్ముడు జాన్‌ స్టీఫెన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్‌ తెలిపారు. 

రెండు గంటలపాటు కారులోనే.. 

ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు నుజ్జు నుజ్జు  జాన్‌జోసెఫ్‌, విజయకుమారి మృతదేహాలను కారులోంచి తీయడానికి సుమారు 2గంటలు  స్థానికుల సహాయంతో పోలీసులు మొదటగా క్షతగాత్రులను దవాఖానకు  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నడిరోడ్డుపై  ఉన్న కారును క్రేన్‌ సహాయంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. 


logo