ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 26, 2020 , 02:40:11

కరోనా కట్టడిలో లయన్స్‌క్లబ్‌ సేవలు అభినందనీయం

కరోనా కట్టడిలో లయన్స్‌క్లబ్‌ సేవలు అభినందనీయం

  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హర్షవర్ధన్‌ 

బొడ్రాయిబజార్‌ : కరోనా కట్టడిలో లయన్స్‌క్లబ్‌ అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నా రు. లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక జనరల్‌ దవాఖానకు 150 ఎన్‌-95 మాస్కులు, 200శానిటైజర్‌ బాటిళ్లు, 50 ఫేస్‌ హెల్మెట్లు, ఆటోమెటిక్‌ శానిటైజర్‌ మిషన్‌, 1000 క్లాత్‌ మాస్కులను లయన్స్‌క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ దార కృష్ణారావు, అధ్యక్షుడు గండూరి కృపాకర్‌ అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్‌ఓ హర్షవర్ధన్‌ మాట్లాడుతూ కరోనా కట్టడిలో భాగంగా లయన్స్‌క్లబ్‌ మాస్కులు, శానిటైజర్లు అందజేయడం హర్షణీయమన్నారు. వాటిని సద్వినియోగం చేసి కరోనా కట్టడికి కృషి చేస్తామన్నారు. కరోనా కట్టడిలో ప్రజలంతా భాగస్వాములై స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. లయన్స్‌క్లబ్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్‌ దండ మురళీధర్‌రెడ్డి, పటేల్‌ నర్సింహారెడ్డి, నూకల వెంకట్‌రెడ్డి, మిర్యాల సుధాకర్‌, పెండెం చంద్రశేఖర్‌, కట్ట ఎల్లారెడ్డి, డాక్టర్‌ మోహన్‌రెడ్డి, అరుణజ్యోతి, కేతిరెడ్డి పద్మ,  భిక్షం, సాలయ్య, సంగిశెట్టి వెంకటేశ్‌ర, కృష్ణ, శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo