సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 26, 2020 , 02:30:43

మొక్కలే జీవకోటికి ప్రాణాధారం

మొక్కలే జీవకోటికి ప్రాణాధారం

  • శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ 

కట్టంగూర్‌ : మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని,  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు కృషి చేయాలని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ అన్నారు. గురువారం మండలంలోని పామనుగుండ్లలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. 

వర్షాలు వచ్చి మన జీవితాలు బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించుకోవాలని సూచించారు. వృక్ష సంపదను పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 235కోట్లు, జిల్లా వ్యాప్తంగా 85లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం కార్యక్రమం చేపట్టారని, ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలను నాటి పుడమితల్లికి పచ్చని హారం తొడుగుదామన్నారు.

 కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఆర్టీఓ జగదీశ్వర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, వైస్‌ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, సర్పంచ్‌ వడ్డె సైదిరెడ్డి, ఎంపీటీసీ పాలడుగు హరికృష్ణ, తాసిల్దార్‌ హుస్సేన్‌, ఇన్‌చార్జి ఎంపీడీఓ పర్వేజ్‌ తదితరులు పాల్గొన్నారు.  logo