శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 25, 2020 , 02:49:10

సూర్యాపేటలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేటలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట :  ఆరోవిడుత హరితహారం కార్యక్రమాన్ని నేటి నుంచి జిల్లాలో ప్రారంభించనున్నారు. గురువారం సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట, జిల్లా కేంద్రంలోని 9వ వార్డు ఎన్‌టీఆర్‌ పార్కులో విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సూర్యాపేట మండలం ఇమాంపేట, జిల్లా కేంద్రంలోని 9 వ వార్డులో సుమారు వెయ్యి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

జిల్లా వ్యాప్తంగా 83.79లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోని అందుకు అనుగుణంగా మొక్కలను ఆయా నర్సరీల్లో పెంచుతున్నారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 52.51 లక్షల మొక్కలు పెంచగా, అటవీ శాఖకు చెందిన 32 నర్సరీల్లో 27.14 లక్షలు, సూర్యాపేట, కోదాడ మున్సిపాల్టీ నర్సరీల్లో 1.80 లక్షల మొక్కలు సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యన్ని నిర్దేశించగా.. అత్యధికంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలకు 35 లక్షల మొక్కలు నాటేలా టార్గెట్‌ నిర్ణయించారు. అటవీ శాఖ 11 లక్షలు, రోడ్లు భవనాల శాఖ 1.1 లక్షలు, వ్యవసాయ, సహకార శాఖలకు 6.5 లక్షలు, మున్సిపాల్టీలకు 17.79 లక్షలు, ఇరిగేషన్‌ శాఖకు 4.5 లక్షలు, రెవెన్యూ శాఖకు 2.5 లక్షలు, పోలీస్‌, విద్యా, పరిశ్రమల శాఖలకు చెరో లక్ష మొక్కలు, పశు సంవర్థక, మత్య్స, డెయిరీలకు కలిపి 50 వేలు, వైద్య ఆరోగ్య శాఖ 50 వేలు, సాంఘీక సంక్షేమ శాఖ 40 వేల, బీసీ సంక్షేమ శాఖ 30 వేలు, గిరిజన సంక్షేమ శాఖ , ఐటీడీఏ 30 వేలు, మైనార్టీ సంక్షేమ శాఖ 40 వేల మొక్కలు నాటాలని నిర్దేశించారు. logo