మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 24, 2020 , 02:33:59

లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి

లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి

  • డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్‌ 

సూర్యాపేట రూరల్‌ : ఆరో  హరితహారంలో లక్ష్యానికి మించి ఎక్కువ మొక్కలు నాటాలని డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఇమాంపేట, ఆరెగూడెం గ్రామాల్లో మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.

ప్రభుత్వ స్థలాల్లో, చెరువు కట్టలపై, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీడీ రాజు, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, వైస్‌ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, ఏపీఓ వెంకన్న, సర్పంచులు పులగం స్వాతిరాఘవరెడ్డి, పాముల ఉపేందర్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


logo