బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 23, 2020 , 02:54:30

కేసీఆర్‌ రాక...మాకు కొండంత భరోసా

కేసీఆర్‌ రాక...మాకు కొండంత భరోసా

 నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ తమ ఇంటికి వచ్చి పరామర్శించడంతోపాటు బాగోగులు తెలుసుకోవడంతో కొండంత భరోసా కలిగిందని కర్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషి అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ తమ ఇంటికి వచ్చిన వెళ్లిన అనంతరం ఆమె మాట్లాడారు. గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తూ తాను కోరుకున్న విభాగాన్ని ఇచ్చే స్వేచ్ఛను కల్పించారన్నారు. రూ.5 కోట్ల నగదులో రూ.4 కోట్లు తనకు, తనపిల్లల పేరుతో, రూ.1 కోటి మా అత్తగారు మంజుల పేరుతో అందజేశారని చెప్పారు. బంజారాహిల్స్‌లో ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా ఇచ్చారన్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవడంతోపాటు సంతోష్‌బాబుతో చనిపోయిన ఇతర జవాన్లకు కూడా సాయం చేస్తామనడం సంతోషం కలిగించిందని సంతోషి అన్నారు. సంతోష్‌బాబు తల్లి మంజుల మాట్లాడుతూ నా కొడుకు లేనిలోటు ఎవరూ తీర్చలేకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న భరోసా తమకు భవిష్యత్‌పై విశ్వాసం కలిగించేలా ఉందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నివిధాలుగా తమకు అండగా ఉండటం కొండంత ధైర్యాన్నిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ చెప్పిన మాట ప్రకారం తమ ఇంటికి వచ్చి ఇంత త్వరగా సహాయం అందించడం మరువలేమన్నారు.  ఇచ్చిన మాటను ఇంత త్వరగా నిలబెట్టుకున్న సీఎంను కేసీఆర్‌లో చూశామని మంజుల తెలిపారు. 


logo