బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 21, 2020 , 03:15:11

‘పట్టణ ప్రగతి’ పనులను త్వరగా పూర్తి చేయాలి

‘పట్టణ ప్రగతి’ పనులను త్వరగా పూర్తి చేయాలి

‘పట్టణ ప్రగతి’ పనులను త్వరగా పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
  • వివిధ శాఖల అధికారులతో సమీక్ష

నల్లగొండ : పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన  పూర్తి చేయాలని నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన కార్యాలయంలో పట్టణ ప్రగతి, 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపై స మీక్షించారు. మున్సిపాలిటీల్లో పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్మాణం ఆగస్టు 15లోపు పూర్తి చేయాలని వాటికి సంబంధించిన డిజైన్లు రూపొందించి ఆర్‌సీసీ ప్రేమ్‌ స్ట్రక్చర్‌, నాణ్యతతో పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్నా రు. చెత్త సేకరణకు, పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్న స్వచ్ఛఆటోలు, డోజర్ల ప్రతిపాదనలు పంపి మున్సిపాలిటీ నిధుల నుంచే కొనుగోలు చే యాలన్నారు. వీటి కొనుగోళ్లకు సంబంధిం చి అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీలో పరిశ్రమల జీఎం, రవాణా శాఖ ఎంవీఐ, పంచాయతీరాజ్‌ ఈఈ, ఇద్దరు మున్సిపల్‌ కమిషనర్లు సభ్యులుగా ఉంటార న్నారు. ఈ కమిటీ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేసి కంపెనీలను పిలిచి అన్ని మోడల్స్‌ చూడడంతో పాటు కొటేషన్లు పరిశీలించి ధర నిర్ణయిస్తామన్నారు. నల్లగొండ మున్సి పాలిటీలో స్వీపింగ్‌ యంత్రం చిన్న మరమ్మతుతో వినియోగించకపోవడం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశు సంవర్ధక శాఖ వద్ద నిరుపయోగంగా ఉన్న భూమిని తాసిల్దార్‌ స్లాటర్‌ హౌజ్‌ కోసం ప్రతిపాదన పంపాలని, ఇంటిగ్రేటెడ్‌ మార్కె ట్‌, రెండో డంప్‌యార్డు కోసం దేవరకొండ రోడ్డులో భూమి కేటాయింపు ప్రతిపాదన పంపాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో గుర్తించిన  ప్రాంతాల్లో పార్కులను నిర్మించాలని హరితహారంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్నారు.     ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ,  చంద్రశేఖర్‌,  అసిస్టెంట్‌ క లెక్టర్‌ ట్రెనీ ప్రతిమాసిం గ్‌, డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్‌కుమార్‌, డీఈఓ భిక్షపతి,  డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ కందుకూరి వెంకటేశ్వర్లు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి గూడ వెంకటేశ్వర్లు, డీపీఆర్వో శ్రీనివాస్‌, స్త్రీ, శిశు, వయో వృద్ధ్దుల సంక్షేమ శాఖ అధికారి  సుభద్ర, జిల్లా మలేరియా అధికారి దుర్గయ్య పాల్గొన్నారు. logo