మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 21, 2020 , 01:22:54

కరోనా కలకలం

కరోనా కలకలం

భద్రాచలం, బూర్గంపహాడ్‌, పాల్వంచ, బోనకల్లు, ఖమ్మంలో శనివారం కరోనా కలకలం సృష్టించింది. పాల్వంచ, బోనకల్లు, ఖమ్మంలో ఒక్కొక్క కేసు నమోదైంది. ‘పాజిటివ్‌' వ్యక్తి భద్రాచలం, బూర్గంపహాడ్‌లలో సంచరించాడు.

బూర్గంపహాడ్‌/భద్రాచలం: ఏపీలోని కూనవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. మండల కేంద్రమైన బూ ర్గంపహాడ్‌ లో ఆయనకు జ్యూయలరీ దుకాణం ఉంది. దీని నిర్వహణను తన బావమరిదికి అప్పగించి వారానికి ఒకటి రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా కూనవరం వైద్యులు శుక్రవారం నిర్ధారించి, రాజమండ్రి ఆసుపత్రిలోని క్వారంటైన్‌ కేం ద్రంలో ఉంచారు. అంతకు ఒక్క రోజు (శుక్రవారం) ముందే ఆయన బూర్గంపహాడ్‌లోని తన షాపు వద్దకు వచ్చి బావమరిదిని కలిశారు. అక్కడి నుంచి పాల్వంచలో ని అత్తారింటికి వెళ్లారు. భద్రాచలంలోని సలీం టీ స్టాల్‌ వద్ద టీ తాగి కూనవరం వెళ్లారు.  ఈ సమాచారం అందిన వెంటనే అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఆ జ్యూ యలరీ షాపునకు వచ్చి వెళ్లిన వారి వివరాలను సేకరించారు. చుట్టుపక్కల కిలోమీటర్‌ దూరం వరకు అన్ని దు కాణాలను మూసివేయించారు. ఆ ప్రాం తంలో బ్లీచింగ్‌ చల్లించి, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణా న్ని పిచికారీ చేయించారు. పది రోజులపాటు ఈ ప్రాంతం కంటైన్మెంట్‌ జోన్‌గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పది బృందాలు ఇం టింటా సర్వే నిర్వహించాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భాస్కర్‌ నాయక్‌, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత శనివారం బూర్గంపహాడ్‌ చేరుకున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై స్థానిక అధికారులతో చర్చించారు. అటు భద్రాచలంలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. సలీం టీ స్టాల్‌తోపాటు సమీపంలోగల దుకాణాలను 14 రోజులపాటు మూసివేయాలని ని ర్వాహకులను ఆదేశించారు. ఈ టీ స్టాల్‌తో ప్రతి రోజూ టీ తాగేవారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు, గొంతులో నొప్పి, జ్వరం ఉంటే.. వెంటనే సమీప వైద్యులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సూపర్‌బజార్‌ సెంటర్‌, యూ బీ రోడ్డు, రాజులసత్రం వీధిలో పంచాయతీ అధికారులు బ్లీచింగ్‌ చల్లించారు. ఇక్కడ చేపట్టిన పారిశుధ్య పనులను శనివారం మధ్యాహ్నం జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత పరిశీలించారు. బూర్గంపహాడ్‌ మండలంలో ప్ర స్తుతం ఎవరికీ కరోనా  సోకలేదని, కనీసంగా లక్షణాలు కూడా కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలెవరూ భయపడొద్దని, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

కేటీపీఎస్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌కు..

పాల్వంచ: కేటీపీఎస్‌ 7వ దశ యూనిట్‌ కంట్రోల్‌ బోర్డు(యూసీబీ)లో ఇటీవలి వరకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పనిచేసిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా శనివారం నిర్ధారణయింది. ఆయనను చీరాలకు బదిలీ చేస్తూ ఈ నె ల 5న ఉత్తర్వులు వచ్చాయి. ఈ నెల 6 నుంచి రెండు రో జులపాటు సెలవు పెట్టి వనపర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. 9, 10 తేదీల్లో కేటీపీఎస్‌లో విధులు నిర్వహించారు. 11వ తేదీన జ్వరం సోకింది. అధికారుల సూచనలతో 12వ తేదీ నుంచి సెలవు పెట్టి మూడు రోజులపాటు పాల్వంచలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు కూడా వెళ్లొచ్చారు. ఈ నెల 17న కేటీపీఎస్‌ నుంచి రిలీవ్‌ అయి చీరాలలో వి ధుల్లో చేరారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆ స్పత్రిలో చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా ని ర్ధారణయింది. ఆయన పాల్వంచలోని గొల్లగూడెంలోగల అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. అయనతో సం బంధమున్న వారి వివరాలను అధికారులు సేకరించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులతోపాటు దగ్గరగా మెలిగిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు.

బోనకల్లులో రైల్వే స్టేషన్‌ మాస్టర్‌కు...

బోనకల్లు: బోనకల్లులో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ మాలతి శనివారం ఒ క ప్రకటనలో తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో స్టేషన్‌ మా స్టర్‌గా పనిచేస్తున్న అధికారి భార్య ఈ నెల 4న విజయనగరం వెళ్లారు. అక్కడి ప్రభుత్వం ఆమెకు ఈ నెల 13న క రోనా పరీక్షలు నిర్వహించింది. పాజిటివ్‌గా నిర్ధారణయిం ది. దీంతో, బోనకల్లు రైల్వే స్టేషన్‌లో స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ యనకు కూడా వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. శనివా రం వచ్చిన రిపోర్టులో ఆయనకు కూడా పాజిటివ్‌గా తే లింది. వెంటనే 108 వాహనంలో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వైద్యాధికారులు తరలించారు. అతనితో కలిసి తిరిగిన వారంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు. మూడు రోజులపాటు బోనకల్లు బంద్‌ పాటిస్తున్నట్లు సర్పంచ్‌ సైదానాయక్‌ తెలిపారు.

ఖమ్మంలో ఒకరికి.. 

మయూరిసెంటర్‌: ఖమ్మం నగరంలో ఒకరికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి ఒకరు ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్‌ ప్రాంతంలోగల అత్తారింటికి ఈ నెల 18న భార్యాపిల్లలతో వచ్చారు. విజయవాడలో విధులు నిర్వహిస్తున్నప్పుడే జలుబు, జ్వరం, దగ్గు వచ్చింది. ఈ నెల 19న ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శనివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణయింది. ఆయనను జిల్లా ప్ర భుత్వ వైద్యశాలలోగల ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. 


logo