శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 16, 2020 , 02:26:19

ఆకర్షించే ఇంటీరియర్‌ డిజైన్స్‌

ఆకర్షించే ఇంటీరియర్‌ డిజైన్స్‌

మేళ్లచెర్వు : మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన బొల్లవరపు శ్రీనివాసాచారి చింతలపాలెం మండలం దొండపాడు జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల ఆయన తన స్వగ్రామంలో నిర్మించుకున్న ఇంట్లో చేసిన ఇంటీరియర్‌ డిజైన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. గణితంపై తనకు గల మక్కువతో ఆయన తన ఇంటిలోపలి ఇంటీరియర్‌ డిజైన్‌కు సైతం గణిత గుర్తులతో చేయించారు. ఇంట్లోని హాల్‌ సీలింగ్‌కు అంకగణిత ప్రక్రియ గుర్తులను, గోడకు అహింసావాది బుద్ధుడి 3డీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకున్నారు. ఇంటీరియర్‌ డెకరేషన్స్‌కు సుమారు రూ.35వేలు ఖర్చు చేసినట్లు, ఇందుకోసం రాజస్థాన్‌కు చెందిన పని వారిని ప్రత్యేకంగా పిలిపించినట్లు శ్రీనివాసచారి తెలిపారు. ఈ డిజైన్లు ఆకట్టుకునేలా ఉండడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంట్లోని డిజైన్లను గణితంతో మేళవించ డం వల్ల పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేలా చేయవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.   logo