గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jun 16, 2020 , 02:23:36

తీరొక్క మాస్క్‌

 తీరొక్క మాస్క్‌

మార్కెట్‌లోకి రంగురంగుల మాస్కులు

సూర్యాపేట అర్బన్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పని సరిగా ధరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోకి అనేక రకాల మాస్కులు వచ్చాయి. బయటకు వెళితే తప్పక మాస్క్‌ ధరించాల్సిన పరిస్థితి నెలకొనడంతో వినియోగదారులు కూడా తీరొక్క మాస్క్‌ను కొనుగోలు చేస్తున్నారు. తయారీ దారులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రంగులు, డిజైన్లతో వాటిని తయారు చేసి విక్రయానికి ఉంచుతున్నారు. కుటుంబంలోని చిన్నా, పెద్దా అందరికీ మాస్కులు కోనుగోలు చేస్తుండడంతో గిరాకీ ఏర్పడుతోంది. గతంలో మాస్కులను కేవలం కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించారు. కానీ కరోనా పుణ్యమాని ప్రతిఒక్కరూ వాడాల్సి రావడంతో విక్రయించే వారు కూడా అధికమయ్యారు. కరోనా మహమ్మారి ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో మాస్కులు ఎక్కువ కాలం పాటు వాడాల్సిన అవసరాన్ని గుర్తించిన తయారీ దారులు వీటి తయారీ, విక్రయాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. 

అందుబాటులో  ఉన్నవివే..

ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఫిల్టర్‌ను మార్చుకునే మాస్క్‌లు, ఎన్‌- 95, సర్జికల్‌, డబుల్‌ లేయర్‌, సింగిల్‌ లేయర్‌ మాస్కులతో పాటు బనియన్‌ క్లాత్‌తో తయారు చేసిన మాస్క్‌లు, కాటన్‌ క్లాత్‌తో ఇళ్ల్లల్లో చేసిన మాస్కులు కూడా విక్రయానికి ఉంచారు. వినియోగదారులను ఆకట్టుకునేలా తయారు చేసేందుకు వివిధ రంగుల, డిజైన్ల క్లాత్‌ను దీనికోసం వినియోగిస్తున్నారు. logo