గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 14, 2020 , 03:13:05

‘కార్యకర్తల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటాం’

‘కార్యకర్తల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటాం’

సూర్యాపేట టౌన్‌ : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడంతోపాటు.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబాలను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నామని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన 8వ వార్డు సభ్యుడు ధరావత్‌ లింగా, చివ్వెంల మండలం చందుపట్లకు చెందిన గుండెబోయిన బుచ్చయ్య కుటుంబసభ్యులకు శనివారం బీమా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పలు ప్రమాదాల్లో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించి అండగా నిలిచామన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రజలతోపాటు కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ మరిన్ని సేవలు అందిస్తుందన్నారు. 

మీలాకు నివాళి : సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన సుధాకర్‌ పీవీసీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా సత్యనారాయణకు మంత్రి జగదీశ్‌రెడ్డి నివాళి అర్పించారు. స్థానిక సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో శనివారం జరిగిన మీలా ప్రథమ వర్ధంతి సభలో మంత్రి పాల్గొని మీలా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు.


logo