సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 14, 2020 , 03:10:53

సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి విస్తృత పర్యటన

సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి విస్తృత పర్యటన

సూర్యాపేటరూరల్‌/ చివ్వెంల : రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేట నియోజకవర్గవ్యాప్తంగా శనివారం విస్తృతంగా పర్యటించి రూ.2.37 కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రధానంగా మంత్రి దత్తత గ్రామమైన ఆత్మకూర్‌.ఎస్‌ మండల పరిధిలోని ఏపూరుకు మహర్దశ పట్టిందనే చెప్పవచ్చు. ఆ ఒక్క గ్రామంలోనే రూ.60 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.15 లక్షలతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నిర్మించనున్నారు. అలాగే  నెమ్మికల్‌ గ్రామంలో ప్రాచుర్యం పొందిన దండుమైసమ్మ ఆలయంలో రూ.50లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన డార్మిటరీ హాల్‌తో పాటు యాత్రికుల వసతి కోసం స్నానపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగా చివ్వెంల మండలంలోని చారిత్రాత్మక ఉండ్రుగొండ లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో   రూ.30లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఘాట్‌తోపాటు డార్మిటరీ హాల్‌లకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

 అంతకుముందు సూర్యాపేట మండలం ఇమాంపేటలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామీణ పశువైద్యశాలతోపాటు చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరిలో నిర్మించి ఇటీవలే ప్రారంభించిన 72  డబుల్‌ బెడ్రూం గృహసముదాయం పరిధిలో రోడ్ల నిర్మాణాలు, అక్కడే ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. జిల్లా మినరల్‌ ఫండ్‌ నుంచి సేకరించిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఆత్మకూర్‌.ఎస్‌ మండల కేంద్రంలో గ్రంథాలయ భవనంతోపాటు అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. ఒకేరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు గ్రామాల్లో సుడిగాలి పర్యటన జరిపారు.

టీఆర్‌ఎస్‌ గూటికి కాంగ్రెస్‌ సర్పంచ్‌ : సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌ పాముల ఉపేందర్‌తో పాటు 200మంది ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ మంత్రి గలాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తాజావార్తలు


logo