మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 12, 2020 , 08:59:02

బాబాయ్‌ తిట్టిండని బాలిక బలవన్మరణం

బాబాయ్‌ తిట్టిండని బాలిక బలవన్మరణం

 దామరచర్ల : బాబాయి తిట్టాడని  మనస్తాపానికి గురైన ఓ బాలిక(15)ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని కల్లేపల్లిలో గురువారం చోటుచేసుకుంది. వాడపల్లి ఎస్‌ఐ నర్సింహారావు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక కుటుంబానికి, తన బాబాయి సోమ్లా మధ్య భూవివాదాలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో సోమ్లా బాలిక తండ్రికి ఫోన్‌ చేసి కుటుంబ సభ్యులు, బాలికపై వ్యక్తిగత దూషణలు చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని  మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు.  


logo