శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 11, 2020 , 01:14:03

నిబంధనలు బేఖాతరు

నిబంధనలు బేఖాతరు

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించినా.. జనం చెవికెక్కడం లేదు. ఫలితంగానే ఇటీవల తుంగతుర్తిలోని ఓ బ్యాంకు ఉద్యోగి  కరోనా బారిన పడ్డాడు. అయినా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్యాంకుల్లో భౌతిక దూరం నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటున్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. బుధవారం సూర్యాపేట మెయిన్‌రోడ్‌లో పోలీస్‌స్టేషన్‌ పక్కనే ఉన్న ఆంధ్రాబ్యాంకులో కనిపించిన దృశ్యమిది. 

-బొడ్రాయి బజార్‌


logo