సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 10, 2020 , 05:39:10

ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం

ఘనంగా బొడ్రాయి  వార్షికోత్సవం

మఠంపల్లి : మండలంలోని కామంచికుంటతండాలో బొడ్రాయి వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి నీళ్ల బిందెలతో ఊరేగింపుగా వెళ్లి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. పాడి పంటలు సమృద్ధిగా పండి, ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభం వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునీల, ఉపసర్పంచ్‌ సైదానాయక్‌, గ్రామపెద్ద సుక్కోనాయక్‌ పాల్గొన్నారు. 


logo