శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 09, 2020 , 05:20:35

ఆలయాలు తెరుచుకున్నాయి.

ఆలయాలు తెరుచుకున్నాయి.

రెండున్నర నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి.చాలాకాలం తర్వాత దైవ దర్శనం చేసుకునే భాగ్యం కలిగిందన్న ఆనందంలో ఉన్నా.. రక్షణ చర్యలను మాత్రం భక్తజనం మరిచిపోలేదు. క్యూలైన్ల ప్రారంభం కన్నా ముందే శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకొని.. భౌతిక దూరం పాటిస్తూ దేవతా దర్శనం చేసుకున్నారు. వేకువజాము నుంచే అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. హారతులు, అర్చనలు, అభిషేకాలను వీక్షించిన భక్తజనం ఆనందంతో పరవశించిపోయారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రిలో తొలిరోజు స్థానిక భక్తులకు మాత్రమే అవకాశం కల్పించగా.. మంగళవారం నుంచి ఇతర ప్రాంతాల వారిని అనుమతించనున్నారు. భద్రాద్రి రామయ్య, అలంపూర్‌ జోగుళాంబ, ఏడుపాయల వనదుర్గాభవాని,వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి, కొండగట్టు అంజన్న, కాళేశ్వర ముక్తీశ్వరుడు, బాసర సరస్వతీ దేవి, వరంగల్‌ భద్రకాళి, కొమురవెల్లి మల్లన్న తదితర ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.

యాదాద్రి


logo