శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 08, 2020 , 03:51:23

145క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

145క్వింటాళ్ల  పీడీఎస్‌ బియ్యం పట్టివేత

 కోదాడ రూరల్‌ : రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా  డీసీఎంను కోదాడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని  చెందిన గుగులోత్‌ వీరన్న, భూక్యా దేవ్‌సింగ్‌, బాణోత్‌ లాలు శనివారం రాత్రి పంతుల్‌నాయక్‌తండా శివారులో వివిధ గామాల నుంచి ద్విచక్ర వాహనాలపై తీసుకొచ్చిన రేషన్‌ బియ్యాన్ని డీసీఎంలో  చేస్తుండగా.. పక్కా సమాచారంతో  దాడి చేసి పట్టుకున్నారు. 95 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డీసీఎంను, రెండు  ఎక్సెఎల్‌ వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  డ్రైవర్‌ ఇమ్రాన్‌ పఠాన్‌ను అరెస్టు చేశారు. నిందితులు  వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ సైదులు తెలిపారు.

దామరచర్లలో 50 క్వింటాళ్లు..

దామరచర్ల : ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని మండలంలోని కొండ్రపోల్‌ వద్ద పోలీసులు శనివారం అర్ధరాత్రి పట్టుకున్నారు. వాడపల్లి ఎస్‌ఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రాకు చెందిన రెండు లారీల్లో దళారులు మండలంలోని బాలాజీనగర్‌తండా, మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామాల వద్ద నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యాన్ని లోడ్‌ చేస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు వాడపల్లి ఎస్‌ఐ పోలీస్‌ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఒక లారీలో 50, మరో లారీలో 48 బస్తాలు లోడ్‌ చేశారు. ఇద్దరు డ్రైవర్లతోపాటు మరొకరిని అదుపులోకి తీసుకొని, లారీలను స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని ఆంధ్రాలోని దాచేపల్లికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బియ్యం వ్యాపారం చేసే ముఠాను అదుపులోకి తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.logo