ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 06, 2020 , 02:11:53

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : మంత్రి

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : మంత్రి

సూర్యాపేట టౌన్‌ : పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, హరితహారంలో నాటిన ప్రతి మొక్కను  సంరక్షించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటి మాట్లాడారు. పురపాలక మంత్రి కేటీఆర్‌ చేపట్టిన ప్రతి శుక్రవారం వాటరింగ్‌ డే ద్వారా మొక్కలను సంరక్షించడంతోపాటు.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రతి ఇంట్లో 10 నిమిషాలు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజుల రెడ్డి, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, ఉప్పల ఆనంద్‌, ఎండీ సల్మామస్తాన్‌, ముదిరెడ్డి అనీల్‌ రెడ్డి, కీసర వేణుగోపాల్‌ రెడ్డి, కౌశిక్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


logo