శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 05, 2020 , 00:57:48

వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌ : ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటే వ్యాధులు మనకు దరిచేరవని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని 15, 16, 17 వార్డుల్లో పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటి పారిశుధ్య నిర్వహణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ‘మన కోసం మనం’ వాల్‌ స్టిక్కర్లను ఆయా వార్డుల్లో అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ వార్డుల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, నాటిన మొక్కలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధుల కాలం వస్తున్నందున గుంతలు, నిరుపయోగ వస్తువుల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో ఏ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గెల్లి రవి, కమిషనర్‌ నాగిరెడ్డి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. logo