బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 03, 2020 , 01:47:08

కరోనాతో పోరాడింది వైద్య సిబ్బందే : మంత్రి

కరోనాతో పోరాడింది  వైద్య సిబ్బందే : మంత్రి

  • చివ్వెంల పీహెచ్‌సీలో ఆశ కార్యకర్తలకు  నిత్యావసరాల పంపిణీ  

చివ్వెంల : దేశంలో ఎక్కడైనా విపత్తులు ఏర్పడితే పోరాటం చేసేది సైనికులు, పోలీసులు, ప్రత్యేక సిబ్బంది మాత్రమేనని, ఇప్పుడు మహమ్మారి కరోనాను ఎదుర్కొన్నది మాత్రం వైద్య సిబ్బందేనని   విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రేటర్‌ నల్లగొండ ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేసి మాట్లాడారు. ఆశ కార్యకర్తల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తల వరకు వారు చూపిన తెగువ, సాహసం ప్రపంచ చరిత్రలో మిగిలిపోతుందన్నారు. ముఖ్యంగా ఆశ కార్యకర్తల పాత్ర ఎక్కువగా ఉండడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దాతలను మంత్రి అభినందించారు. 


logo