మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 02, 2020 , 00:30:02

స్వేచ్ఛ లభించిన రోజు ఇది..

స్వేచ్ఛ లభించిన రోజు ఇది..

  • జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 
  • మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట టౌన్‌ :  ‘జూన్‌ 2’ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛాదినంగా నిలిచిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరాయి పాలనలో మగ్గిన ప్రజలకు స్వరాష్ట్రంలో సుపరిపాలన అందుతున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలనలో యావత్‌ భారత దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఆరేండ్ల పాలన జనరంజకంగా కొనసాగిందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఎవరికి వారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షించారు. 


logo