శనివారం 11 జూలై 2020
Suryapet - May 31, 2020 , 04:26:51

లబ్ధిదారులకు ప్రభుత్వ భూములందించాలి

లబ్ధిదారులకు ప్రభుత్వ భూములందించాలి

జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు కె.రాములు 

సూర్యాపేట : చట్టాలకు లోబడి పేద ఎస్సీలకు న్యాయం చేయాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ భూములు అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు కె.రాములు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌, అదనపు కలెక్టర్‌ డి.సంజీవరెడ్డితో కలిసి మాట్లాడారు. గతంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ఎస్సీ రైతులకు అప్పటి ప్రభుత్వం 1973లో మఠంపల్లి మండలంలోని గుర్రంపోడు గ్రామంలో భూములు ఇచ్చింది, ఆ భూములకు డీ-ఫారం తెచ్చుకొని మఠంపల్లి మండలానికి చెందిన ఒక వ్యాపారవేత్త బినామీ పేర్లతో పట్టాలు చేయించుకొని అసలు లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని కొంతమంది ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములను కోరగా ఆయన ఈ విషయమై చర్చించారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో నిజమైన లబ్దిదారులే ఉండేలా చూడాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్సీ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అమలు చేయాలని సూచించారు. కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ మాట్లాడుతూ గతంలో లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలు ఎందుకు రద్దయ్యాయో పూర్తి వివరాలు ఇరుపక్షాల ద్వారా తెలుసుకొని తదుపరి చర్యలు చేపడతామన్నారు.  సమావేశంలో కోదాడ ఆర్డీఓ కిశోర్‌కుమార్‌, కోదాడ, సూర్యాపేట డీఎస్పీలు, మఠంపల్లి తాసీల్దార్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. logo