బుధవారం 08 జూలై 2020
Suryapet - May 25, 2020 , 03:29:43

పేదల పక్షపాతి మంత్రి జగదీశ్‌రెడ్డి: ఎంపీపీ, జడ్పీటీసీ

పేదల పక్షపాతి మంత్రి జగదీశ్‌రెడ్డి: ఎంపీపీ, జడ్పీటీసీ

సూర్యాపేట రూరల్‌ : పేదల పక్షపాతి మంత్రి జగదీశ్‌రెడ్డి అని ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి,  జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత నిధులతో అందించిన రంజాన్‌ తోఫాను ఆదివారం మండలంలోని కేటీ అన్నారం, కాసరబాద గ్రామాల్లో ముస్లిం కుటుంబాలకు అందజేసి మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా   మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గంలోని ము స్లిం కుటుంబాలకు రంజాన్‌ తోఫా అందించారన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామసాని శ్రీనివాసనాయుడు, సర్పంచులు కొల్లు రేణుక, బైరెడ్డి భీమిరెడ్డి, ఎంపీటీసీ బంటు నాగమ్మ, కో ఆప్షన్‌ సభ్యుడు గాలిబ్‌ అహ్మద్‌, సంకరమద్ది రమణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరేశ్‌, సైదులు, నాగరాజు, శ్రవణ్‌, రాజు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

నిరుపేద ముస్లింలకు పెద్దన్న మంత్రి  

పెన్‌పహాడ్‌ : కరోనా కష్టకాలంలోనూ పవిత్ర రంజాన్‌ను ముస్లింలు ఘనంగా జరుపుకునేందుకు  మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వారికి పెద్దన్నలా అండగా నిలవడం సంతోషకరమని జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య అన్నారు. రంజాన్‌ను పురస్కరించుకొని మంత్రి సొంత ఖర్చుతో సమకూర్చిన రంజాన్‌ తోఫాను ఆదివారం మండలంలోని అనంతారంలో ముస్లింలకు అందజేశారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ మామిడి రేవతి, టీఆర్‌ఎస్‌ నాయకులు దంతాల వెంకటేశ్వర్లు, పొదిల నాగార్జున, చిట్టెపు నారాయణరెడ్డి, పుట్ట శ్రీను, మామిడి అంజయ్య, మస్తాన్‌, మామిడి వెంకటయ్య, మసూద్‌ అలీ, మదార్‌ తదితరులు పాల్గొన్నారు.   

16వ వార్డులో.. 

సూర్యాపేట అర్బన్‌ : 16వ వార్డులోని ముస్లిం కుటుంబాలకు సొంత నిధులతో రంజాన్‌ తోఫా అందజేయడం ఆనందంగా ఉందని కౌన్సిలర్‌ సలిగంటి సరిత అన్నారు. ఆదివారం వార్డులోని సుమారు 70మంది ముస్లిం కుటుంబాలకు తోఫా అందజేశారు. కార్యక్రమంలో ఖలీల్‌ పాషా, హనుమంతరావు, లింగయ్య, ప్రతాప్‌రెడ్డి, అన్నపూర్ణ, గోపి, గణేశ్‌, శ్రవణ్‌  తదితరులు పాల్గొన్నారు.  logo