శనివారం 06 జూన్ 2020
Suryapet - May 22, 2020 , 00:33:30

కరోనాపై మరింత అప్రమత్తం

కరోనాపై మరింత అప్రమత్తం

 కానిస్టేబుల్‌ మృతితో ‘నల్లగొండ’ అలర్ట్‌

నీలగిరి : జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌ కరోనా బారిన పడి  గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆయన కొన్ని రోజుల కిందట జిల్లాకు వచ్చారు. మర్రిగూడ, కోదండాపురం, కురంపల్లిలోని బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కానిస్టేబుల్‌ కుటుంబీకులను క్వారంటైన్‌కు పంపి అనుమానితుల గుర్తింపునకు ఆయా గ్రామాల్లో సర్వే చేపట్టింది. ఎవ్వరికీ లక్షణాలు కన్పించకపోవడం ప్రస్తుతానికి ఊరటనిస్తోంది. 


logo