గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - May 20, 2020 , 02:22:31

సడలింపులు మాత్రమే.. స్వీయ నియంత్రణ తప్పనిసరి

సడలింపులు మాత్రమే.. స్వీయ నియంత్రణ తప్పనిసరి

సూర్యాపేట టౌన్‌/ రూరల్‌ : ప్రజల అవసరాలు, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులిచ్చినప్పటికీ ప్రజలు స్వీయనియంత్రణ తప్పనిసరిగా పాటించాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు, ఖమ్మంరోడ్డులో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావుతో కలిసి క్రైస్తవులకు, టీఆర్‌ఎస్‌ నేత వైఎల్‌ఎన్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కళాకారులు, పారిశుధ్య సిబ్బందికి, జాహ్నవి టౌన్‌షిప్‌లో, పలువార్డుల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆపత్కాలంలో పేదలకు సహాయం చేసిన దాతలను మంత్రి అభినందించారు. అదేవిధంగా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో సర్పంచ్‌ కంచర్ల నిర్మలాగోవిందరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు మంత్రి చెత్తబుట్టలు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, ఎన్‌డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, నంద్యాల దయాకర్‌రెడ్డి, పుట్ట కిశోర్‌,   మాదంశెట్టి వీరన్న, పూర్ణ శశికాంత్‌, అజీజ్‌, రియాజుద్దీన్‌, తాహెర్‌, సల్మా, దుర్గం ప్రభాకర్‌, మీసాల ప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డిలతోపాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


logo