శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - May 15, 2020 , 23:34:00

నిత్యావసరాలు పంపిణీ

నిత్యావసరాలు పంపిణీ

 జిల్లాలోని ఆయాప్రాంతాల చర్చి పాస్టర్లకు క్రైస్తవ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రేఖల భద్రాద్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. జిల్లాకేంద్రంలోని బీటీఎస్‌లో షాలియన్‌ ప్రేయర్‌హౌజ్‌లో ఒక్కొక్కరికి 25కిలోల బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేశ్‌, కౌన్సిలర్‌ పిల్లి రామరాజు, ఆలకుంట్ల మోహన్‌బాబు, రవీందర్‌రావు, రేఖల అన్నమ్మ, మార్టిన్‌ తదితరులు పాల్గొన్నారు. 

 పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పట్టణంలోని మినా ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ మహిమూద్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసరాలను ఎమ్మెల్యే పేదలకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రవినాయక్‌, అశోక్‌రెడ్డి, సుబ్బారాయుడు తదితరులు ఉన్నారు.

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఆశ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్యార గోపాల్‌, మామిడి పరుశురాం, పోలె సైదులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అంతంపేటలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికుల కుటుంబాలకు దేవరకొండ డీఎస్పీ టి.ఆనందరెడ్డి కౌన్సిలింగ్‌ ఇచ్చి, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. ఆయన వెంట నాంపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ క్రాంతికుమార్‌ , సిబ్బంది ఉన్నారు. 

మండల పరిధిలోని కొత్తగూడెం శ్రీమహర్షి  దయానంద సరస్వతీ వృద్ధాశ్రమంలో బీజేపీ పట్టణ మహిళామోర్చా అధ్యక్షురాలు రాయపూడి ఆశలతజగన్‌మోహన్‌ క్వింటా బియ్యం, పండ్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.  ఆమ్‌ ఆద్మీ ఆధ్వర్యంలో వెంకటాద్రిపాలెంలోని గాంధీనగర్‌లో పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఫారుఖ్‌, తల్వార్‌, జహంగీర్‌, సైదులు, ఉమర్‌, వెంకన్న పాల్గొన్నారు. 


logo