శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - May 10, 2020 , 02:38:48

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు

  • ఎస్పీ భాస్కరన్‌

సూర్యాపేట సిటీ : సూర్యాపేట జిల్లాలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ తెలిపారు. సూర్యాపేటలో బందోబస్తును శనివారం పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించవద్దన్నారు. సాయంత్రం 7 నుంచి ఉదయం 6గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. లాక్‌డౌన్‌ సడలింపును ఆసరాగా తీసుకొని రోడ్లపై అనవసరంగా తిరిగే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, మాస్కులు పెట్టుకోకుండా బయట తిరిగితే జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే వాహనాలు సీజ్‌ చేసి, వాహనదారులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1955 మందిపై 1236 కేసులు నమోదు చేసి 4779 వాహనాలు సీజ్‌ చేసినట్లు తెలిపారు.


logo