గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - May 09, 2020 , 02:56:29

మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

దామరచర్ల/ తిప్పర్తి/ మాడ్గులపల్లి : నర్సరీల్లో మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. శుక్రవారం దామరచర్ల మండలం రాజగట్టు, తిప్పర్తి మండలం రాయినిగూడెం, మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. గ్రీన్‌ప్లాన్‌ ప్రకారం మొక్కలు పెంచాలని, వనసేవకులకు వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు. అనంతరం పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠధామం, వర్మీకంపోస్టు షెడ్డు, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధ్దన్‌రెడ్డి, ఆర్డీఓ రోహిత్‌సింగ్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ డీ నారాయణరెడ్డి, ఏపీడీ శైలజ, దామరచర్ల, తిప్పర్తి ఎంపీపీలు రమావత్‌ నందిని, నాగులవంచ విజయలక్ష్మి, మాడ్గులపల్లి జడ్పీటీసీ పుల్లెంల సైదులు, దామరచర్ల, తిప్పర్తి, మాడ్గులపల్లి ఎంపీడీఓలు జ్యోతిలక్ష్మి, మహేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి ఉన్నారు.

29వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్‌

నీలగిరి : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ఈ నెల 29 వరకు  రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు ఫిర్యాదులు స్వీకరించబోమని బాధితులు  గమనించాలని ఆయన కోరారు. 


logo