మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - May 07, 2020 , 02:53:44

జిల్లాలో కురిసిన వర్షం..

జిల్లాలో కురిసిన వర్షం..

నీలగిరి/చిట్యాల/ హాలి యా/ మునుగోడు/ చందంపేట : జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. నాంపల్లి, మునుగోడు, నార్కట్‌పల్లి, డిండి, హాలియా, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్‌), నాగార్జునసాగర్‌, నిడమనూరు, త్రిపురారం, గుర్రంపోడు, చిట్యాల, చందంపేట మండలాల్లో మోస్తరు వర్షం కురువగా, పలు ప్రాంతాల్లో చిరు జల్లు పడింది. జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఈదురుగాలులు వీయగా, మునుగోడు మండలం కచలాపురంలో ఓ ఇంటి పైకప్పు కూలింది. చందంపేట మండలంలోని గన్నెర్లపల్లిలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది.


logo