గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - May 06, 2020 , 02:50:04

3,680 కిలోల నల్లబెల్లం పట్టివేత

3,680 కిలోల నల్లబెల్లం పట్టివేత

  • ముగ్గురి అరెస్టు

దేవరకొండ, నమస్తే తెలంగాణ : మండలంలోని ఓ క్రషర్‌ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 3,680 కిలోల నల్లబెల్లం, 20 కిలోల పటికను మంగళవారం ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  నల్లగొండ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శంకరయ్య దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దేవరకొండ సమీపంలో దేవరకొండ- మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఎక్సైజ్‌ అధికారులు రూట్‌ వాచ్‌ నిర్వహిస్తుండగా.. 40 కిలోల నల్లబెల్లాన్ని బైకులపై తరలిస్తూ బొల్లిగుట్టతండాకు చెందిన నేనావత్‌ రమేశ్‌, నేనావత్‌ బిచ్యా పట్టుబడ్డారు. వారిని విచారించి తండా వద్ద ఉన్న వెంకటేశ్వర స్టోన్‌ క్రషర్‌ మిల్లులో నిల్వ ఉంచిన 3,680 కిలోల బెల్లం, 20 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండకు చెందిన చందా శేఖర్‌ ఏడాదిగా మిల్లులో బెల్లం, పటికను ఉంచి అక్రమంగా వ్యాపారం చేస్తున్నాడని, అతడితో పాటు రమేశ్‌, బిచ్యాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. సమావేశంలో దేవరకొండ ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు, ట్రైనీ ఎస్‌ఐలు ఉన్నారు. 


logo