బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - May 06, 2020 , 02:50:06

జూలై నాటికి వన నర్సరీలు సిద్ధం చేయాలి

జూలై నాటికి వన నర్సరీలు సిద్ధం చేయాలి

తిరుమలగిరి (సాగర్‌): జూలై నాటికి వన నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెదబావితండాలో హరితహారం  వన నర్సరీని ఆయన పరిశీలించారు. నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలని, వాటిని సంరక్షించాలని ఆదేశించారు. ఆయన వెంట తిరుమలగిరి, అనుముల ఎంపీడీఓలు పీవీఎస్‌ఆర్‌కే శర్మ, గోశిక బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అనూషారెడ్డి తదితరులు ఉన్నారు. 

మొక్కలను సంరక్షించాలి: డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి

మాడ్గులపల్లి : గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కన్నెకల్‌ గ్రామంలో నర్సరీని పరిశీలించారు. వచ్చే వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మొక్కలు వేసవితాపాన్ని తట్టుకునేలా గ్రీన్‌షెడ్లను ఏర్పాటుచేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జితేందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు. logo