ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - May 04, 2020 , 02:40:54

నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ

నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ

  • చింతపల్లి మండల పరిధిలోని దేన్యాతండాలో  ప్రణవ్‌ ట్రస్టు చైర్మన్‌ బురుగు రవికుమార్‌ ఆధ్వర్యంలో 350కుటుంబాలకు ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గున్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నట్వ గిరిధర్‌ పాల్గొన్నారు.  
  • నల్లగొండలోని పారిశుధ్య కార్మికులు, నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో డీఈఓ భిక్షపతి కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మోడల్‌ స్కూల్‌ అసోసియేషన్‌ నాయకులు విజయేందర్‌, మిర్యాల వెంకటేశ్‌గౌడ్‌, పటేల్‌ పాల్గొన్నారు. 
  • మండలంలోని చెర్కుపల్లికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అడపాల జంగారెడ్డి కుమారుడు ఎన్‌ఆర్‌ఐ ప్రదీప్‌కుమార్‌ వారి మిత్ర బృందం చెర్కుపల్లి, బొల్లనపల్లి, ఎర్రారంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
  • మండల పరిధిలోని చీకటిమామిడి, గూడపూర్‌, గంగోరిగూడెంతో పాటు పలు గ్రామాల్లో నిరుపేదలకు డీసీసీబీ డైరెక్టర్‌ కుంభం శ్రీనివాసరెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. 
  • శ్రీలక్ష్మీనారాయణ స్వామి సేవా సమితి చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా సేవా సమితి సభ్యులు బాటసారులు, వాహనదారులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. రామడుగు శ్రీనివాసశర్మ, కోమటి భాస్కర్‌, నూకల శ్రీధర్‌రెడ్డి, వనం లింగయ్య, తోటకూరి యాదయ్య, ఓరుగంటి రమేశ్‌ పాల్గొన్నారు.  
  • మున్సిపాలిటీ సిబ్బందికి అరవింద హైస్కూల్‌ 2000-01 బ్యాచ్‌ పదోతరగతి విద్యార్థులు, పట్టణ కిరాణా షాపుల యజమానులు వేర్వేరుగా నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ ఆధ్వర్యంలో సుందరయ్యనగర్‌ కాలనీలో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గోశిక వెంకటేశం, అనంతరెడ్డి పాల్గొన్నారు. గుండ్రాంపల్లిలో ఉద్యోగమిత్ర సంఘం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి 25 కేజీల బియ్యం, వట్టిమర్తిలో 60 కుటుంబాలకు సీపీఎం ఆధ్వర్యంలో 12కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు. చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. 
  • నమస్తే తెలంగాణ : ఫ్రెండ్స్‌ గ్యారేజ్‌, నరేశ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 120మంది ప్రైవేటు పాఠశాలల టీచర్లకు బియ్యం, కూరగాయలు అందించారు. ఎస్‌ఐ శివకుమార్‌, కౌన్సిలర్‌ చంద్రారెడ్డి, ఎంఈఓ తరి రాము, చైర్మన్‌ గొట్టిముక్కుల నరేశ్‌ సరిత, ఫ్రెండ్స్‌ గ్యారేజ్‌ సభ్యులు నామని సుధాకర్‌, కూకట్ల రాము, కుకుడాల ఆంజనేయులు, రమణశర్మ, గోవింద్‌, కర్నాసాగర్‌ పాల్గొన్నారు.


logo