శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Apr 27, 2020 , 01:58:49

జిల్లాలో వర్షం.. తడిసిన ధాన్యం

జిల్లాలో వర్షం.. తడిసిన ధాన్యం

నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి నాంపల్లి మండలం చిట్టంపాడులో గొర్రెలకాపరి అబ్బనబోయిన కొండయ్య(55) మృతి చెందగా చండూరు మండలం నెర్మటలో ఎద్దు మృత్యువాత పడింది. కొండమల్లేపల్లి, నాంపల్లి, మునుగోడు, పీఏపల్లి, కనగల్‌, చండూరు మండలాల్లో వడగండ్లు పడడంతో కోతకు వచ్చిన పొలాల్లో ధాన్యం నేలరాలగా ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. గుర్రంపోడు మండలం పాశంవారిగూడెంలో వర్షంతో కూడిన ఈదురుగాలులకు గోడ కూలి మూడు మేకలు మృతి చెందాయి. నేరేడుగొమ్ము మండలం వైజాగ్‌ కాలనీలో భారీ వృక్షం కూలి ఇంటి గోడపై పడటంతో ధ్వంసమైంది. పలుచోట్ల విద్యుత్‌ తీగలు తెగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 


logo