గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Apr 20, 2020 , 01:32:33

గ్రామాల్లోకి ఎవ్వర్నీ రానీయొద్దు..

గ్రామాల్లోకి ఎవ్వర్నీ రానీయొద్దు..

  • డీసీపీ నారాయణరెడ్డి

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఇందులో భాగంగా ఇతర ప్రాంతాల వ్యక్తులను గ్రామాల్లోకి రానీయకుండా చూడాలని.. ఈ విషయంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. ఆదివారం యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 300 మంది వలసకూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపై మండల ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల నుంచి బయటికి వెళ్లే వారి వివరాలను సేకరించాలన్నారు. అవసరమైతే రిజిస్టర్లలో వారి పేర్లను నమోదు చేయాలన్నారు. రాబోయే వారం రోజులు అత్యంత కీలకమన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు లేకపోవడం అదృష్టమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించాలన్నారు. స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని.. అత్యవసర సమయాల్లోనే బయటికి రావాలన్నారు. అప్పుడు తప్పక మాస్కులు ధరించాలన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, సీఐ పాండురంగారెడ్డి, ఎస్సై గుండెల రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ జంపాల రజిత, మున్సిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధ, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, సర్పంచులు కర్రె వెంకటయ్య, మొగిలిపాక తిరుమల, తోటకూరి బీరయ్య, బైరగాని చిన్నపుల్లయ్యగౌడ్‌, ఆరె స్వరూప, రాములు తదితరులు పాల్గొన్నారు.


logo