శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Apr 12, 2020 , 23:18:14

కష్టాల్లో ఉన్నవారికి భరోసా

కష్టాల్లో ఉన్నవారికి భరోసా

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కష్టాల్లో ఉన్నవారికి పలువురు దాతలు అండగా నిలిచారు. ఆదివారం ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 100 మందికి కిచిడీని అందజేశారు.  మైలారీగూడెంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట పోలీసు సిబ్బంది, ట్రాఫిక్‌, అగ్నిమాపక, 108 సిబ్బందికి మాసాయిపేట  వార్డు సభ్యుడు గుణగంటి బాబురావు  భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అఖిల భారత పద్మశాలీ సత్రం, పద్మశాలీ సత్రం యాదగిరిగుట్ట ఆధ్వర్యంలో పట్టణంలోని 300 మంది నిరుపేద పద్మశాలీ కుటుంబాలకు నిత్యావసర వస్తువులను యాదగిరిగుట్ట పట్టణ సీఐ పాండురంగారెడ్డి అందజేశారు. మోటకొండూర్‌లో  ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో దాతలు వేద్గిరి ఫార్మా చైర్మన్‌ మోహన్‌రెడ్డి అందించిన 400 లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని సర్పంచ్‌ వడ్డెబోయిన శ్రీలత, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి సర్పంచులకు అందజేశారు. కదిరేణిగూడెంలో అభివృద్ధి భారత్‌ పార్టీ అధ్యక్షులు వేముల కృష్ణ, వేముల పాండు ఆధ్వర్యంలో గ్రామస్తులకు శానిటైజర్లు మాస్కులు  పంపిణీ చేశారు. ముత్తిరెడ్డిగూడెం, కొండాపూర్‌ గ్రామాల్లో  పేద కుటుంబాలకు నాంచారిపేట గ్రామానికి చెందిన గంధమల్ల అశోక్‌, శ్రావణి, ముత్తిరెడ్డిగూడెం ఉప సర్పంచ్‌ కొమ్మగాని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తుర్కపల్లి మండలంలో పారిశుధ్య కార్మికులు, పోలీసు సిబ్బందికి కాంగ్రెస్‌  మండలాధ్యక్షుడు శంకర్‌నాయక్‌, ఎంపీటీసీ కానుగంటి శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో శానిటైజర్లు పంపిణీ చేశారు. ఆత్మకూరు(ఎం) మండలం  కూరెళ్లలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. మొరిపిరాలలో సర్పంచ్‌ తిరుమల్‌రెడ్డి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయగా, పారుపల్లికి చెందిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం భువనగిరి డివిజన్‌ అధ్యక్షుడు సోమరాజు పోలీసులకు పండ్లు పంపిణీ చేశారు. పోలీసులు, తహసీల్దార్‌ కార్యాలయం ఉద్యోగులకు మండల కేంద్రంలోని పాత గ్రామం యువకులు అన్నదానం చేశారు. బొమ్మలరామారంలో పారిశుధ్య కార్మికులకు చీకటిమామిడి రైస్‌ మిల్లు యజమాని ఎనిశెట్టి సుదర్శన్‌గుప్తా, మైలారం సర్పంచ్‌ వడ్లకొండ అరుణాఆనంద్‌చారి సహకారంతో బియ్యం, గుడ్లను ఎంపీపీ సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలనర్సయ్య, ఎస్సై మధుబాబు అందజేశారు. ఆలేరులోని మున్సిపల్‌ సిబ్బందికి బాలచంద్రిక క్లబ్‌ వ్యవస్థాపకుడు ఎస్‌ హరగోపాల్‌, సభ్యులు మున్సిపల్‌ సిబ్బందికి నిత్యావసర వస్తువులు అందజేయగా,  ప్రభుత్వ ఏరియా దవాఖానలో పని చేస్తున్న వైద్య సిబ్బంది, పట్టణంలోని యాచకులకు ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లు అందజేశారు.

ఆత్మకూరు(ఎం)లో... 

  మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ కార్మికులకు ఆదివారం మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుడు అల్లెపు ప్రసాద్‌ 50 కిలోల బియ్యంతో పాటు రూ.500 అందజేశారు.  మండల కేంద్రానికి చెందిన రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ గడ్డం దశరథగౌడ్‌ 60మంది పేద కుటుంబాలకు, 30 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. 

నిబంధనలు పాటిస్తున్న వృద్ధులు 

మండల కేంద్రానికి చెందిన  వృద్ధులు బీరయ్య, పెరుమాండ్లు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.బయటకు వెళ్లేటప్పుదు మూతికి బట్టకట్టుకొని వెళ్తున్నారు.  


logo