శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 31, 2020 , 03:08:51

‘సీఎంఆర్‌ఎఫ్‌'కు విరాళాల అందజేత

‘సీఎంఆర్‌ఎఫ్‌'కు విరాళాల అందజేత

నార్కట్‌పల్లి : కరోనా నియంత్రణ చర్యలకు తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం విరాళాలు అందజేశారు. ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్‌ చైర్మన్‌ గంట్ల నర్సిరెడ్డి రూ. 25వేలు, చెర్వుగట్టు ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి రూ. 20వేలు, ఏళ్ల వెంకట్‌రెడ్డి, ఏనుగు దయాకర్‌రెడ్డిలు రూ.15వేలు, మాజీ సర్పంచ్‌ కొండూరి శంకర్‌, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ బత్తుల అనంతరెడ్డి రూ.35వేల చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అందజేశారు. 

పీఏసీఎస్‌ తరఫున లక్ష విరాళం..

కట్టంగూర్‌ : కట్టంగూర్‌ పీఏసీఎస్‌ తరుఫున రూ.లక్ష చెక్కును చైర్మన్‌ నూక సైదులు, జడ్పీటీసీ తరాల బలరాములు సోమవారం ఎమ్మెల్యే చిరుమర్తికి అందజేశారు. అలాగే స్థానిక ఇటుకబట్టీల యా జమాన్యం రూ.50వేలు అందజేసింది. 

రూ.1.75లక్షలు అందించిన సర్పంచులు 

చిట్యాల : మండలానికి చెందిన 18మంది సర్పంచులు రూ.1.75లక్షలు సీఎం సహాయ నిధికి అందించారు. సోమవారం పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కలిసి చెక్కును అందజేశారు. అదేవిధంగా ఎంపీపీ, 12మంది ఎంపీటీసీలు, కో ఆప్షన్‌ సభ్యుడు తమ నెల వేతనం రూ.70వేలను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 


logo