మంగళవారం 07 జూలై 2020
Suryapet - Mar 30, 2020 , 01:54:39

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి

  • నిత్యావసరాల వాహనాలకే అనుమతి
  • నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ 

నల్లగొండ, నమస్తే తెలంగాణ : సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్పీ రంగనాథ్‌ సూచించారు. ఆదివారం జిల్లాలోని నార్కట్‌పల్లి, చిట్యాల, పంతంగి టోల్‌ప్లాజాతోపాటు నకిరేకల్‌, కట్టంగూర్‌, తిప్పర్తి, మిర్యాలగూడ, వాడపల్లి సరిహద్దులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అధికారులతో కాసేపు మాట్లాడారు. కొవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా ఇరురాష్ర్టాల అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిత్యావసర, వైద్య సామగ్రి వాహనాలను అనుమతించాలని సిబ్బందికి సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. జిల్లాలోని సరిహద్దుల వద్ద పోలీస్‌ సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహించాలని, విధుల్లో మాస్కులు ధరించాలని, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు ఉపయోగించాలని సూచించారు. 


logo