సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 22, 2020 , 03:15:26

ప్రయాణం.. ప్రమాదం

ప్రయాణం.. ప్రమాదం

  • బస్సులు, రైళ్లు, ఆటోలకు దూరంగా ఉంటేనే మంచిది 
  • పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌తో కరోనా సోకే అవకాశాలు ఎక్కువ 
  • అనవసర ప్రయాణాలొద్దు.. సమూహాలతో కలువొద్దు
  • అత్యవసరం అయితే.. సొంత వాహనాల్లోనే వెళ్లాలి  n  వ్యక్తిగత 
  • పరిశుభ్రత.. సామాజిక దూరమే ప్రధానం

 నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రయాణాలు నివారించాలని ప్రభుత్వం ముందు నుంచి చెప్తూనే ఉన్నది. కరోనా మహమ్మారితో వణికిపోతున్న ఇటలీ వంటి దేశాలను చూసైనా.. ప్రజలు జన సమూహాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రయాణాలు తగ్గించుకొని.. ఫంక్షన్లకు దూరంగా ఉంటున్నా.. ఇంకా చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సు లు, రైళ్లు, ఆటోల్లో ప్రయాణం సురక్షితం కాదని, వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం వందలు, వేల మంది ఆయా వాహనాల్లో ప్రయాణం చేస్తున్నందున.. ఎవరెవరు ఏయే ప్రాంతాల నుంచి వచ్చారో తెలియదని, ఎంత మందికి అంతర్గతంగా కరోనా ఉందోనన్న విషయం తెలియకుండా పబ్లిక్‌తో ప్రయాణాలు చేయడం సరికాదని చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులను శుభ్రం చేయిస్తున్నా.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు ఇతర వ్యక్తులకు ఆరు అడుగుల దూరం పాటించడం సురక్షితం అనేది శాస్త్రవేత్తలు చేస్తున్న సూచన.

ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి

  •  డాక్టర్‌ ఎండీ నిరంజన్‌, డీఎం హెచ్‌ఓ, సూర్యాపేట

ప్రస్తుతం రోజురోజుకూ పెరుగు తున్న ‘కరోనా’ బాధితుల దృష్ట్యా ప్రయాణాలు వాయిదా వేసు కోవడం మంచిది. మొదటి నుంచి ప్రయాణాలు చాలా ప్రమాదకర మని హెచ్చరిస్తున్నప్ప టికీ లెక్క చేయకుండా అవగాహన లోపంతోనే బాధితుల సంఖ్య పెరుగుతోంది. బస్సు, రైలు ఇలా జన సమూహాల తో కలిసి ప్రయాణించేటప్పుడు.. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియక.. సంబంధ లేని వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా ఒక్కరు వైరస్‌ బాధితులు ఉంటే వారి ద్వారా ఎంతమందికి సోకిందో తెలియక సతమతమ య్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఇకనైనా కరోనా వైరస్‌ ప్రబల కుండా కట్టడి చేయాలంటే ప్రజలంతా తమ ప్రయాణాలను వాయిదా వేసుకొని సహకరించాలి.  logo