శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 10, 2020 , 00:59:30

కమనీయం.. రమణీయం

కమనీయం.. రమణీయం

నల్లగొండకల్చరల్‌ : నల్లగొండ సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌ వద్ద గల శ్రీ భూ నీలా సమేత వేంకటేశ్వరస్వామి అష్టమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయ ప్రధానార్చకుడు లక్ష్మీనర్సింహచార్య అంగరంగ వైభవంగా జరిపించారు. కల్యాణోత్సవానికి  శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌వీ.సాంబయ్య-శ్రీలక్ష్మీ దంపతులు తలంబ్రాలను సమర్పించారు. శ్రీ తిరుమల వేంకటేశ్వరస్వామివారికి నిత్య కల్యాణం జరిగే తరహాలో కల్యాణం నిర్వహించడంతోపాటు వేంకటేశ్వరుని కల్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ వేడుకకు బెటాలియన్‌ ఉద్యోగులు, సిబ్బంది, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. అనంతరం అన్నదానం చేశారు. రాత్రి విష్ణుసాహస్ర నామపరాయణం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకలో దేవాలయ స్థల దాత, వ్యవస్ధాపక అధ్యక్షుడు మారం జగన్‌మోహన్‌రెడ్డి-పుష్పాదేవి దంపతులు పాల్గొన్నారు.

నేడు చక్రస్నానం...

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ కోశాధికారి, ఆర్‌ఐ శ్రీరాముల నాగేశ్వరరావు తెలిపారు. సాయంత్రం  విష్ణుసహస్రనామ పరాయణం, దేవతోద్వాసన, పవళింపుసేవ, పండిత సన్మానం ఉంటుందని తెలిపారు.logo