బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 10, 2020 , 00:58:29

నిలువెత్తు నిర్లక్ష్యం..

నిలువెత్తు నిర్లక్ష్యం..

నల్లగొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ సైన్స్‌, ఆర్ట్స్‌ బ్లాక్‌ భవనాల ఫస్టు ఫ్లోర్‌ స్లాబ్‌పై గడ్డి ఏపుగా పెరిగింది. దీంతో సైన్స్‌ బ్లాక్‌లో ఆ గడ్డి లోపల నుంచి నీరు కారి ల్యాబ్‌ల్లోకి వచ్చి నిమ్ముగా ఉంటుందని సంబంధిత అధ్యాపకులు వాపోతున్నారు. మరోవైపు రిజిస్టర్‌ చాంబర్‌కు సమీపంలోని ప్రాంతాల్లో కూడా ఇదే సమస్య దర్శనమిస్తోంది. యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ విభాగంతోపాటు అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలమవుతుందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ భవనాల రిపేర్‌ కోసం లక్షల రూపాయలను వృథా చేస్తున్నారు. ఆర్ట్స్‌ బ్లాక్‌ సమావేశ మందిరాన్ని గతంలో రూ. కోటితో తీర్చిదిద్దినా చదలు రావడంతో ఇటీవలే మళ్లీ రూ.4 లక్షలతో మరమ్మతులు చేయించడమే ఇందుకు నిదర్శనం.  

 - నల్లగొండ విద్యావిభాగంlogo