గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Mar 09, 2020 , 01:27:47

నేడే హోలీ

నేడే హోలీ

నల్లగొండకల్చరల్‌: రంగుల పండుగ హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ఊరూవాడ సిద్ధమైంది. ఆదివారం రాత్రి కాముడిదహనం నిర్వహించగా సోమవారం వసంతోత్సవాన్ని జరుపుకోనున్నారు. అందుకోసం పిల్లలు, పెద్దలు రంగులను సిద్ధం చేసుకున్నారు. పల్లెల్లో మోదుగుపూలను తీసుకొచ్చి రంగులు తయారుచేసుకుంటున్నారు. అయితే చాలామంది మార్కెట్‌లో దొరికే సహజరంగులను కొనుగోలు చేయడం కనిపించింది. హోలీకి ఉపయోగించే దుస్తులను సైతం కొనుగోలు చేశారు. సోమవారం ఉదయం నుంచే సంబురాలు ప్రారంభంకానున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లతో పాటు పలుకాలనీల్లో సైతం ఉత్సాహంగా చిన్న, పెద్దతేడా లేకుండా హోలీ సంబురాలు జరుపుకోనున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ వేడుకలు అంబరాన్నంటేలా సాగనున్నాయి.  మరోవైపు హోలీ వేడుకులకు అవసరమైన సామగ్రిని సైతం పిల్లలు, పెద్దలు కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో సందడి కనిపించింది.


logo