శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Mar 09, 2020 , 01:25:15

సాగర్‌లో పర్యాటకుల సందడి

సాగర్‌లో పర్యాటకుల సందడి

 నందికొండ :  ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సం దడి నెలకొంది. నల్లమల్ల అడవుల సహజ అం దాల మధ్య తెలంగాణ టూరిజంశాఖ కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన జాలీ ట్రిప్పు లాంచీ ప్రయాణం బాగుందని పర్యాటకులు తెలిపారు. పర్యాటకుల సంఖ్యను బట్టి జాలీ ట్రిప్పులను నడుపుతున్నామని లాంచీస్టేషన్‌ మేనేజర్‌ హరిబాబు తెలిపారు. పర్యాటకులతో  లాంచీ స్టేషన్‌, బుద్ధవనం, డ్యాం పరిసరాలు కిటకిటలాడా యి.  జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ కుటుంబ సభ్యులతో సాగర్‌ను సందర్శించారు. డ్యాం, బుద్ధ్దవనం, ఎత్తిపోతల జలపాతం సందర్శించారు. బుద్ధవనంలో బుద్ధుడి పా దాల వద్ద పుష్పాలు ఉంచి నమస్కరించారు. బుద్ధుడి జీవిత గాథలను తెలిపే బుద్ధ్దచరితవనం, మహాస్థూపం, జాతక పార్కులోని శిల్పలను పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులతో జాలీ ట్రిప్పునకు వెళ్లారు.logo